'సైరా' కోసం గుండు చేయించుకున్న బ్రహ్మాజీ

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
  • బ్రహ్మాజీకి ప్రత్యేక పాత్ర 
  • చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే నమ్మకం
చిరంజీవి 151వ సినిమాగా 'సైరా' తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సినిమాలో బ్రహ్మాజీ ఒక విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. కథను మలుపు తిప్పే ఈ పాత్రలో ఆయన గుండుతో కనిపించవలసి వుంటుందట. దాంతో ఆయన గుండు చేయించుకున్నట్టు సమాచారం.

 బ్రహ్మాజీ కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎన్నో పాత్రలను పోషిస్తూ వచ్చాడు. సీరియస్ పాత్రల్లోను .. నవ్వించే పాత్రల్లోను ఆయన సందడి చేశాడు. అయితే ఆయన ప్రతిభకు తగిన పాత్ర పడలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్ర చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి. 
Go Back to Shorts
chiranjeevi
nayanatara

More Telugu News